- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైసీపీలో ఇప్పటివరకు ఓ మోస్త‌రు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెద్దపెద్ద తలకాయలను కూడా టార్గెట్ చేయనుంది. వీరిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి - రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు ప్రధానంగా తెర‌మీదుకు వస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరులోని రుస్తుం ప్రాంతంలో ఉన్న క్వార్జ్‌ గనులను అక్రమంగా తవ్వి రు. 250 కోట్ల రూపాయల వరకు పోగేసుకున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న ప్రధాన అభియోగం. అయితే ఈ కేసులో ఆయన ముందస్తు బయలు తెచ్చుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడే కూటమి సర్కారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ గనులు ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గాలను ఆయన బెదిరించారని కులం పేరుతో దూషించారని పేర్కొంటూ మరో కేసు నమోదు చేసింది. ఇది గ‌నుల కేసు కంటే కూడా తీవ్రంగా మారింది.


ఈ నేపథ్యంలో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిష‌న్ పై హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇక మద్యం కుంభకోణంలో అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డి పేరును ఈ కేసులో చేర్చారని ఆయనే చెబుతున్నారు. ఈ క్రమంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వాలని మిథున్ రెడ్డి కోరారు. దీనిపైనా హైకోర్టు వెనక్కి తెగింది. ఫలితంగా ఈ ఇద్దరు నాయకులను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అయితే వీరిద్దరు కూడా జగన్‌కు అత్యంత సన్నిహితులు .. కావలసినవారు కావడంతో పాటు రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకులు. దీంతో ఇప్పుడు వీరిని కాపాడుకోవాల్సిన అవసరం.. బాధ్యత రెండు జగన్ మీద ఉన్నాయి.


ఈ నేపథ్యంలో జగన్ వీరిని అరెస్టు కాకుండా చూసేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంత ఖర్చయినా పర్వాలేదు ..మంచి లాయర్లను నియమించాలని జగన్ పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చారు. హైకోర్టు బెయిల్ రాణి పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా సూచన చేశారు. ఏది ఏమైనా పెద్ద నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేయడంతో జగన్ స్వయంగా రంగంలోకి దిగి వారిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: