- ( విజ‌య‌వాడ‌ - ఇండియా హెరాల్డ్ )

వంగవీటి రంగా రాజకీయ వారసుడుగా రాజకీయాలకు వచ్చారు రాధా. 2004లో కేవలం 25 సంవత్సరాల చిన్న వయసులోనే తొలిసారి విజయవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వేసిన రాంగు స్టెప్పులు ఆయన కెరీర్ను పాతాళంలోకి నెట్టేసాయి. ఆయన పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతుంది. ఒకప్పుడు డిమాండ్ చేసి టికెట్ దక్కించుకున్న ఈ కుటుంబం ఇప్పుడు చిన్నపాటి పదవుల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా రాధా సీఎం చంద్రబాబు రెండుసార్లు కలుసుకున్నారు. గురువారం .. బుధవారం రెండు రోజులు కూడా ఆయన అత్యంత రహస్యంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించిన ఆయన విజయం దక్కించుకునే అవకాశం లేదన్న సర్వే రిపోర్ట్ లో ఆధారంగా చంద్రబాబు వంగవీటి వారసుడిని పరిగణ‌లోనికి తీసుకోలేదు. దీంతో రాధా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మాత్రం యాక్టివ్గా పనిచేశారన్న‌ది వాస్తవం.


తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన రాధాకు ఆశించిన మేరకు గుర్తింపు రాలేదు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు నామినేటెడ్ ప‌ద‌వి అయినా దక్కుతుందని రాధా ఆశించారు. కానీ ఇప్పటివరకు అది కూడా ఇవ్వలేదు. ఇది అలా ఉంటే రంగా - రాధా మిత్రమండలి కాపు సామాజిక‌ వర్గం నుంచి రాధా విషయంలో వ్యక్తిగత సగ పెరుగుతుంది. ఎన్ని పదవులు ఇచ్చిన ఒక్కటి కూడా దక్కించుకోలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆదిలో రాజ్యసభ అంటూ కొంత ప్రచారం జరిగింది. తర్వాత రాధాను శాసనమండలికి పంపిస్తున్నారని ప్రచారం తెరమీదకు వచ్చింది. ఇదే జరిగి ఉంటే రాధా కొంతమేర పుంజుకునేవారు.. కానీ ఆయనకు ఆ అవకాశం కూడా దక్కలేదు.


ఈ పరిణామాల క్రమంలో రాధా తాజాగా చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్పొరేషన్ .. నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలో రాధా వెళ్లి చంద్రబాబును కలుసుకోవడం ద్వారా ఈ పదవులు ఆయన కోరుతున్నట్టు ప్రచారం ఉంది. అయితే వీటికి ప్రాధాన్యం లేదని రాధా ఇవి తీసుకున్నా ఉపయోగం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: