
దీంతో ఇప్పుడు ఆ జిల్లాలో ర్యాండమ్ పరీక్షల సైతం చేయాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన పల్లం గ్రామంలో సుమారుగా 15000 మంది జనాభా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారట. వీరందరికీ కూడా ఈ వైద్య పరీక్షలు అందించేలా అక్కడ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. హెపటైటిస్ B,C వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే కచ్చితంగా అది కాలేయ ప్రభావం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. అలాగే లైంగిక సంపర్కం, బ్లడ్ ట్రాన్స్ఫర్ సిరంజులు సూదుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ తెలియజేస్తున్నారు.
ఈ కేసులో సైతం ఎక్కువగా విస్తరించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వారికి ప్రత్యేకించి మరి చికిత్స చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో పరీక్షలు కూడా కోనసీమ జిల్లాలో శరవేగంగా అధికారులు చేయిస్తున్నారట. మరి రాబోయే రోజుల్లో ఈ హెపటైటిస్ వైరస్ మారిన పడ్డ వారు ఎంత మందు తేలుతారేమో చూడాలి మరి. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలు ఇప్పుడు మరొకసారి ఇలాంటి హెపటైటిస్ వైరస్ల వల్ల మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.