వైసిపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతను అరెస్టు చేసేందుకు.. ఏపీ సిఐడి పోలీసులు దిగినట్లు తెలుస్తోంది. వైసిపి పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టుకు ఢిల్లీకి వెళ్లారు ఏపీ సిఐడి బృందాలు. లిక్కర్ పాలసీ పైన దర్యాప్తు తొలిదశలో ఉందని మొన్న హైకోర్టుకు చెప్పి... ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా పేర్కొంది ఏపీ సి ఐ డి.

 ఈ తరుణంలోనే ఎంపీ మిథున్ రెడ్డి   ముందస్తు బెయిల్ పిటిషన్  ను కూడా డిస్మిస్ చేసింది ఏపీ  హైకోర్టు. అయితే ఇది జరిగిన మరుసటిరోజే అరెస్టు చేయడానికి ఢిల్లీకి వెళ్లారు ఏపీ సిఐడి బృందాలు. అయితే ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు మిథున్ రెడ్డి.   అయితే ఇవాళ రేపు... సుప్రీంకోర్టుకు సెలవులు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పైన సోమవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.


 అయితే ఇవాళ ఢిల్లీకి వెళ్లిన ఏపీ సిఐడి పోలీసులు... వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దింతో వైసిపి క్యాడర్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఒకవేళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే... ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని పైన కూడా వైసిపి నేతలు సమావేశం అయినట్లు తెలుస్తోంది.  అటు ఎలాగైనా ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం మాత్రం సిద్ధం చేసింది ఏపీ సి ఐ డి.

 ఇది ఇలా ఉండగా... ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... వైసిపి పార్టీ నేతలు ఒక్కొక్కరు అరెస్టు అవుతున్నారు. గతంలో వైసీపీ నేతలు చేసిన తప్పిదాలపై కేసులు పెడుతూ కూటమి.. సర్కార్ బొక్కలో వేస్తోందని వార్తలు వస్తున్నాయి. అలా ఇప్పటికే చాలామంది నేతలపై కేసులు కాగా మరికొంతమంది జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ జైలులో ఉండగా పోసాని కృష్ణ మురళి మొన్ననే రిలీజ్ అయ్యారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: