
మొదటిసారి నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురం కి వెళ్ళగా అక్కడ టిడిపి కార్యకర్తలు చుక్కలు చూపించారు. ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడిన వ్యాఖ్యలకు అటు టిడిపి కార్యకర్తలు పిఠాపురం టిడిపి వర్మ అనుచరులు సైతం పెద్ద ఎత్తున నాగబాబుకు నిరసనలు తెలియజేస్తున్నారు. నాగబాబు పలు రకాల కార్యక్రమాలకు వెళ్ళిన అక్కడ కూడా కొన్ని రకాల నినాదాలు చేస్తూ జై టీడీపీ, జై వర్మ అంటూ ప్రతి నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో జనసేన కార్యకర్తలు కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ విరుచుకుపడుతున్నారు.
ఇప్పుడు తాజాగా నాగబాబు మరొకసారి పిఠాపురం నియోజవర్గంలో పర్యటించగా కుమారపురంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సైతం వెళ్లిన నాగబాబుని టిడిపి కార్యకర్తలు సైతం చుట్టుముట్టారట. జై వర్మ అంటూ పలు రకాలు నినాదాలు చేస్తూ ఉండడంతో కొంతమేరకు అసహనాన్ని కూడా తెలియజేసినట్లు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఆ వెంటనే అటు జనసేన కార్యకర్తలు కూడా జై జనసేన అంటూ అరవడంతో టీడీపీ జనసేన మధ్య బలాబలాలు ప్రదర్శించుకోగా కొంతమేరకు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ అధికారులు సైతం సర్ది చెప్పి పంపించినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి రోజున నాగబాబు కూడా పర్యటన కార్యక్రమం చేయగా అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా వర్మ పర్యటనకు మాత్రం దూరంగానే ఉన్నారు.