
అయితే ఈ కేసులో ఒక భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఆ విద్యార్థి ఆత్మహత్యకు సైతం ఒక యువకుడి ప్రేమ వేధింపులే కారణం అన్నట్లుగా పోలీసులు తేల్చేశారు. మైనర్ బాలికను సైతం ప్రేమిస్తున్నానంటూ ఒక యువకుడు గత కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేశారట. ఆ యువకుడు పెయింటర్ గా అదే గ్రామంలోని పనిచేస్తున్నప్పటికీ పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేశారు.
ఆ యువకుడు వేధింపులు తాళలేక ఈ విద్యార్థి మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందనే విధంగా పోలీసులు సైతం తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి వరహాలా రావు ఫిర్యాదు మేరకే పోలీసులు సైతం ఈ కేసును మరింత దర్యాప్తు చేశారు. అయితే ఆ యువకుడు పరారీలో ఉన్నారని రెండు బృందాలుగా అధికారులు కూడా ప్రత్యేకమైన గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు. పదవ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతి దేహాన్ని అప్పగించినట్లుగా తెలుస్తోంది. పరీక్షలు సరిగ్గా రాయలేదని విషయంతో మనస్థాపానికి గురైంది అనే విధంగా నిన్నటి రోజున వార్తలు వినిపించాయి.. కానీ ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మొత్తానికి మిస్టరీ వీడింది.