ఇటివలె పార్లమెంటులో తాజాగా ప్రవేశపెట్టి ఆమోదం పొందినటువంటి వక్ఫ్ బిల్లుకు సైతం ఎన్డీఏలో భాగంగా టిడిపి, జెడియూలో జనశక్తి పార్టీల సైతం మద్దతు ఇవ్వడం జరిగాయి. దీంతో పార్లమెంటులోని అటు రాజ్యసభ లోక్సభలో ఈ వివాదాస్పదమైన బిల్లు ఆమోదం పొందేసింది. అయితే ఈ బిల్లుకు సైతం మద్దతుగా నిలిచినటువంటి మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీలలోని కొంతమంది నేతలు ఇది తలనొప్పిగా మారింది. ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో చాలామంది జేడియు పార్టీకి మైనార్టీ నేతలు కూడా దూరమయ్యారు.



ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టిడిపికి చెందిన ఒక మైనార్టీ నేత గుడ్ బాయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికలలో విజయవాడలోని టిడిపి ఎంపీ కేసినేని చిన్ని గెలవడం కోసం తాను పనిచేశానని వాజిద్ ఖాన్ అనే ఒక మైనార్టీ నేత నిన్నటి రోజున రాత్రి పార్టీకి రాజీనామా చేసినట్లు ఒక లెటర్ కూడా వైరల్ గా మారుతున్నది. గతంలో చంద్రబాబు పాలన దీక్షను చూసి తాను టిడిపి పార్టీలోకి వెళ్లానని గత ఎన్నికలలో ఎంపీ కేసినేని విజయం కోసం చాలా కష్టపడ్డాను కానీ ఇప్పుడు పార్లమెంటులో వక్ఫ్ బిల్లుకు సైతం చంద్రబాబు మద్దతు ఇవ్వడం తో తనను మనస్థాపానికి  గురయ్యేలా చేసిందంటూ తెలిపారు.


మైనార్టీలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వక్ఫ్ బిల్లుకు సైతం టిడిపి పార్టీ మద్దతు ఇవ్వడంతో తాను మైనారిటీ నేతగా పార్టీలో ఉండడం నచ్చలేదని అందుకే పార్టీని విడాలని నిర్ణయించుకున్నాను అంటూ వాజిద్ ఖాన్ తెలియజేశారు. అందుకోసం తన రాజీనామా లేఖను కూడా టిడిపి పార్టీ విజయవాడ అర్బన్ ఆఫీస్ కు సైతం పంపించినట్లు తెలియజేశారు. అయితే ఈ లేఖను కూడా మీడియా ముందే విడుదల చేసినట్లు తెలుస్తోంది.వక్ఫ్ బిల్లు పైన టిడిపి మద్దతు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో కూడా ఇది చాలా తీవ్రంగా పరిణామాన్ని ఎదుర్కొనేలా కనిపిస్తోందని చాలామంది నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: