- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . . .

టీడీపీ నాయ‌కుడు .. తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు వ్య‌వ‌హారం రోజు రోజుకు బాగా కాంట్ర‌వ‌ర్సీ అవుతుండ‌డంతో పాటు ముదురు తోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కాంట్ర‌వ‌ర్సీ వ్య‌వ‌హార శైలీ తో పాటు స‌ర్కారు ను ఇబ్బంది పెట్ట‌డం . చంద్ర‌బాబు ఎన్ని సార్లు అక్షింత‌లు వేసుకున్నా మార క పోవ‌డంతో పాటు పైగా టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌క‌పోతే తానే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోతాను అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం తో చంద్ర‌బాబు కొలిక‌పూడి పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అస‌లు ఎమ్మెల్యేగా గెలిచిన యేడాదిలోనే ఆయ‌న పై చాలా ఆరోప‌ణ‌లు వ‌చ్చేశాయి. త్వ‌ర‌లోనే కొలిక‌పూడి పై చ‌ర్య‌లు తీసుకునేందుకు టీడీపీ అధిష్టానం రెడీ అవుతున్న‌ట్టుగా కూడా తెలుస్తోంది.


అయితే అగ్ని గి ఆజ్యం పోస్తున్న‌ట్టు అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కులు తాజాగా ఈ వివాదంలో వేలు పెట్టారు. ఒక్క కొలిక‌పూడి మాత్ర‌మే కాదు.. కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. ఆ పార్టీల‌కు చెందిన ప‌లువురు నాయ‌కులు కూడా బ‌హిరంగంగా కామెంట్లు చేశారు. గ‌తంలో చాలా మంది టీడీపీ నాయ‌కులు ఇలా మాట్లాడితే వారిపై లేని చ‌ర్య‌లు ఇప్పుడు ఎస్సీ నాయ‌కుడైన కొలిక‌పూడిపై ఎందుకు ? తీసుకుంటార‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.


జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌తంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప్ర‌శ్నించారు. హోం మంత్రి, ఎస్సీ నాయ‌కురాలు.. వంగ‌ల పూడి అనిత‌పై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు ఎలాంటి చ‌ర్య‌లు లేవ‌ని .. ఇక డిప్యూటీ స్పీక‌ర్ , ఉండి ఎమ్మెల్యే క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు కూడా అనేక విమ‌ర్శ‌లు చేశార‌ని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీకే చెందిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా.. టీడీపీ కూట‌మి పాల‌న వేస్ట్  అన్నా వారి పై లేని చ‌ర్య‌లు ఎస్సీ నేత అయిన కొలిక‌పూడి విష‌యం లోనే ఉంటాయా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఇది మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ అయ్యేలా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: