తెలంగాణ రాష్ట్రంలో... రాజకీయాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి అని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి.... బలమైన ప్రతిపక్ష పార్టీగా  గులాబి పార్టీ దూసుకు వెళ్తోందని చెబుతున్నారు. ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా... ప్రజల పక్షాన గులాబీ పార్టీ... పోరాటాలు చేస్తుందని కూడా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

 దీనికి తగ్గట్టుగానే తాజాగా ఓ సర్వే రిపోర్ట్ బయటికి వచ్చింది. ఈ సర్వే రిపోర్టు ప్రకారం... తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 ఎమ్మెల్యేల  బండారం బయటపడింది. గడిచిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎలా పనిచేశారు..? వాళ్లకి ఎన్ని మార్కులు వేయొచ్చు ? అనే విషయాలపై సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వే రిపోర్ట్ లో కాంగ్రెస్ పార్టీకి దాహరణమైన ఫలితాలు... రావడం జరిగింది.

 ఇక ఈ లిస్టులో... టాప్ 10 లో గులాబీ పార్టీ నేతలే ఉన్నారు. హరీష్ రావు మొదటి స్థానంలో ఉంటే కేసీఆర్ రెండవ స్థానం అలాగే కేటీఆర్ మూడవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మరో ఐదుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ టాప్ 10 లో ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 57 మంది ఎమ్మెల్యేల పనితీరు అత్యంత దారుణంగా ఉందని ఈ సర్వే రిపోర్ట్ లో తేలిందని చెబుతున్నారు. అలాగే తెలంగాణ మంత్రి వర్గం లో ఉన్న ముగ్గురు మంత్రులకు మాత్రమే పాస్ మార్కులు వచ్చాయట.

 ఆ ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్  మరో మంత్రి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీలలో పాయల్ శంకర్  అద్భుతంగా దూసుకు వెళ్తున్నారని సర్వే రిపోర్ట్ వెల్లడించింది. ఇక ఎస్సీలలో భట్టి విక్రమార్క దుమ్ము లేపుతున్నారని తెలిపింది. ఎస్టీలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మొదటి స్థానంలో ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

BRS