
ఇవాళ మద్యం దుకాణాలను మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో జంట నగరాలు అయిన హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ పట్టణాలలో... ఇవాళ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని... హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు.
అయితే బంద్ ఉన్న సమయంలో ఎవరైనా మద్యం దుకాణాలను ఓపెన్ చేసి... సరుకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అర్ధరాత్రి 10 గంటల తర్వాత మద్యం దుకాణా లు ఓపెన్ చేసిన కూడా... చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ఉంటుందన్న సంగతి తెలి సిందే. హైదరాబాదు లో ముస్లిం లు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో హిందువులు అలాగే ముస్లింల మధ్య గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.