ఆంధ్రప్రదేశ్లో కూటమి జత కట్టినప్పటి నుంచి బాగానే జరిగినప్పటికీ ఎన్నికల ఫలితాలు అనంతరం గెలిచిన తర్వాత బిజెపి పార్టీకి విలువ లేకుండా పోతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పదవుల పంపకాలలో టిడిపి, జనసేన అధిక భాగం తీసుకుంటున్నారని బిజెపి పార్టీకి మాత్రం కనీస నామమాత్రంగా కూడా ఇవ్వలేదనే విధంగా బిజెపి నేతలు మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం మార్కెట్ కమిటీ పదవులకు సంబంధించి నడుస్తూ ఉండగా ఇందులో ఎక్కువ భాగం టిడిపి తీసుకుందని అలాగే జనసేన కూడా తీసుకుందని కానీ బిజెపి వచ్చేసరికి అసంతృప్తి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయట.


జనసేన ,టిడిపి పార్టీలతో పోలిస్తే రాష్ట్రంలో బిజెపి పార్టీకి బలం తక్కువగా ఉండవచ్చు.. కానీ మరి ఇంతగా కూటమిలో దిగదుడుపు వ్యవహారం చేస్తున్నారనే విధంగా బిజెపి నేతలు ఫీల్ అవుతున్నారట. ఇప్పటికే రెండు విడతలలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పదవులు సైతం ప్రభుత్వం ఇవ్వగా ఇందులో 47 కమిటీల చైర్మన్ ని ప్రకటిస్తే బిజెపికి కేవలం రెండు ఇవ్వగా.. ఇటీవలే 38 కమిటీలను ప్రకటిస్తే అందులో బీజేపీ పార్టీకి ఒకటి మాత్రమే ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే బిజెపి పార్టీని కూటమిలో జీరో చేస్తున్నారని అసహనం ఇప్పుడు ఏపీ బీజేపీ లీడర్స్లలో మొదలయ్యింది.


కూటమి అన్న తర్వాత అందరూ భాగస్వామ్యులుగా ఉన్నారు కదా రాష్ట్రానికి కేంద్రానికి సహాయం అందడంలో కూడా బిజెపి పాత్ర పోషించడం లేదా అంటూ చాలామంది నేతలు కూటమిని ప్రశ్నిస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బిజెపి నేతలు కార్యకర్తలు కూడా కష్టపడినప్పటికీ మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ వాపోతున్నారు. దీన్నిబట్టి చూస్తే బిజెపి పార్టీ ఏపీలో ఒక బిగ్ క్యూస్షన్ మార్కుగా మిగిలిపోతోంది. ఇక రాబోయే రోజుల్లో ఇలాగే చేస్తే కూటమిలో అసంతృప్తులు మొదలవుతాయనే విధంగా మాట్లాడుకుంటున్నారట. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి చూడాలి మరి. మరి వచ్చే ఎన్నికలలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: