
ఈ స్కీమ్ అంతకంతకూ ఆలస్యం కావడం వల్ల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ కారణాల వల్ల హామీల అమలు ఆలస్యమవుతుందో తెలియాల్సి ఉంది. కూటమి సర్కార్ అమలు చేయాల్సిన హామీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో సైతం ఇప్పటికే ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. హామీ వేగంగా అమలైతే ప్రజలు ఎంతో సంతోషిస్తారు.
పథకాల అమలులో ఏపీ నేతలు తెలంగాణను ఫాలో అయితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉచిత బస్ ప్రయాణం కేవలం జిల్లాల వరకు మాత్రమే అమలు కానుందని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ ప్రచారంలో సైతం నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ విషయంలో ఎన్నో వార్తలు, అపోహలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.
రాబోయే రోజుల్లో అయినా ఈ స్కీమ్ అమలు కాకపోతే మాత్రం ప్రజలు ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్రమంతటా మహిళలకు ఫ్రీ అనేలా ఈ స్కీమ్ ను అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రీ బస్ స్కీమ్ అర్హులకు మాత్రమే అమలయ్యే విధంగా నిబంధనలను అమలులోకి తెస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి కొంతమేర ఆదాయం తగ్గే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎక్కువమందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఉంటయని కచ్చితంగా చెప్పడంలో సందేహం అవసరం లేదు.