ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగోలకు సైతం కూటమి ప్రభుత్వం తాజాగా మరొక గుడ్ న్యూస్ తెలియజేసింది. అదేమిటంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు సైతం త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను కూడా మంత్రి సంధ్యారాణి ఒక కీలక ప్రకటన చేస్తూ పలు విషయాలను తెలియజేసింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలియజేసింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల పైన ఎక్కువగా భారం పడుతోందనే వాదన కూడా తమకు ఎక్కువగా వినిపిస్తోందని తెలిపింది.


అందుకే ఖాళీలు ఉండే ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తోందని త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలలో ఎవరైతే ఉద్యోగులు చేస్తూ ఉన్నారో ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారో వారికి ఉద్యోగులకు పదోన్నతి కల్పించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది మంత్రి సంధ్యారాణి. నిన్నటి రోజున మాన్యం జిల్లాలో పర్యటించిన మంత్రి ఈ విషయాలను తెలియజేసింది.


ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాలలో ఎక్కువగా ఖాళీలు ఉండడంతో మిగిలిన ఉద్యోగులపైన పని భారం ఎక్కువగా పడుతోందని ఉద్యోగులు కూడా తెలియజేస్తున్నారని ఈ భారాన్ని తగ్గించడానికి ఖాళీలు భర్తీ చేయబట్టబోతున్నట్లు తెలియజేసింది. అలాగే ప్రస్తుతం అద్దెభవనాలలో ఉన్న సచివాలయాల స్థానాలలో నూతన భవనాలను కూడా నిర్మిస్తూ ఉన్నామని తెలియజేసింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. దీంతో ఒకవైపు నిరుద్యోగులు అసహనాన్ని తెలియజేస్తూ ఉన్నప్పటికీ మరొకవైపు ఇలాంటి ప్రకటనలతో ఊరించేలా చేస్తున్నారు తప్ప అసలు నోటిఫికేషన్ విడుదల చేయలేదంటూ నిరుద్యోగులు కూడా ఆవేదన చెందుతున్నారు. మరి ఉద్యోగాల నోటిఫికేషన్ కి సంబంధించి అన్ని విషయాలను ఎప్పుడు తెలియజేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: