
గత ఏడాది 90 వేల కోట్ల రూపాయల వరకు అప్పు చేశారు ఏడాది ఇంకా ఆర్థిక సంవత్సరం మొదలు కాకముందే..5750 కోట్ల వరకు అప్పు తీసుకువచ్చారు. అన్ని కార్పొరేషన్ల మీద కూడా మీరు అప్పు తీర్చిన సంగతి అందరికీ తెలుసు ఏపీని అప్పులపాలు చేస్తున్నారు. అమరావతి రాజధాని పేరుతో 31 కోట్లు అప్పు తీసుకువచ్చారు.. అన్నిటికి శ్వేత పత్రం రిలీజ్ చేయాలి అంటూ రామకృష్ణ ఫైర్ అయ్యారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది ఈ పాలనలో ఏ ఒక్క సమస్య మీద ఆయన పరిష్కరించారా అంటూ ప్రశ్నించారు.
అసలు హిందువుల గురించి మాట్లాడుతున్నారు వారికి మీరు ఏం చేశారో చెప్పాలి అంటూ ప్రశ్నించారు. దేశంలో రైతులకు ఏమైనా మేలు చేశారా 2014 నుంచి 2022 వరకు మోడీ పాలనే జరిగింది.. సుమారుగా లక్ష మంది పైగా రైతులు కూలీల ఆత్మహత్య చేసుకున్నారంటూ ఫైర్ అయ్యారు. విదేశాలలో ఉన్న బ్లాక్ మనీని తెప్పిస్తామన్నారు .ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ముస్లింలకు వ్యతిరేకంగా జనాలని అయితే రెచ్చగొట్టడమే జండాగా పెట్టుకున్నారు అంటూ ఫైర్ అయ్యారు. పేద ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ సవరణ తీసుకువచ్చారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఆయనకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వారు ఎవరో తెలియదంటూ ఫైర్ అయ్యారు.. ఆయన ఢిల్లీకి వెళ్లి ఈ బిల్లు పైన మాట్లాడాలి అంటూ ఎద్దేవా చేశారు..ఇప్పుడు ముస్లింల పైన దాడి ఆ తర్వాత క్రిస్టియన్లు.. ఆ తర్వాత దేవాలయాల స్థలాల పైన కూడా వీరు పెత్తనం చెలాయిస్తారు అంటూ తెలియజేశారు. ఈనెల 13వ తేదీన విజయవాడలో భారీ సదస్సు ఉంటుంది అంటూ రామకృష్ణ తెలిపారు.