
ఇందులో భాగంగానే ఇవాళ అలాగే రేపు.. రెండు రోజుల పాటు అరకు పరిసర ప్రాంతాలలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం... అరకు పరిసరాలలో ఉన్న గిరిజన గ్రామాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. రెండు రోజులపాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్.
ఇవాళ అలాగే రేపు ఈ పర్యటన కొనసాగంది. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినబోతున్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది... వాళ్లకు ఎలాంటి అవసరాలు కావాలి... ఆసుపత్రి సౌకర్యాలపై కూడా ఈ పర్యటనలో సమీక్షించబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ రెండు రోజులపాటు మొత్తం గిరిజన ప్రాంతాలకు మాత్రమే కేటాయించబోతున్నారు.