
ఇక పెంచిన పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు సోమవారం అర్ధరాత్రి అంటే ఏప్రిల్ ఏడవ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కేంద్రం ప్రకటనతో... వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారతదేశవ్యాప్తంగా ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్ర ప్రభుత్వం... ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. ఈ ఎక్సైజ్ సుంకాన్ని... అన్ని రాష్ట్రాల నుంచి అదనంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఛాన్సులు ఉన్నాయి.
అంటే నేరుగా వాహనదారులపై ఈ ధరలు పడే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనేది తెలియాలంటే ఇవాళ అర్ధరాత్రి వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం వేస్తే... అప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది. అలా వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు... ఆటోమెటిగ్గా తమ రాష్ట్రాలలో.... తమపై భారం పడకుండా ప్రజలపై నెట్టు వేసే ఛాన్స్ ఉంటుంది.
అలాంటి నేపథ్యంలో... ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా పెట్రోల్, అలాగే డీజిల్ ధరలు.. పెరుగుతాయి. ఉదాహరణకు ఇవాళ లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు ఉంటే... రాష్ట్రాలు కూడా ఈ సుంకాన్ని వసూలు చేస్తే.. 112 రూపాయలు అవుతుంది. అలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధరలు ఉంటాయి. ఇక ప్రస్తుతం.. హైదరాబాద్ మహానగరంలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం రోజున 107 రూపాయల 46 పైసలుగా ఉందన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ చార్జీలు అమలు అవుతే... 109 రూపాయల 46 పైసలుగా మారుతుంది.