ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందువరసలో ఉందని పలు సర్వేల ద్వారా వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. అయితే అంచనాలు వేరని వాస్తవంగా పెరగడం వేరని అంచనాలనే వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆధారాలతో సహా కొన్ని లెక్కలను బయటపెడుతుండటం గమనార్హం.
 
2024 - 2025లో రాష్ట్రం ఊహించని స్థాయిలో అభివృద్ది సాధించిందని చంద్రబాబు చెబుతున్నారని కొన్ని రోజుల క్రితం వరకు రాష్ట్రం అప్పులపాలైందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఆ మాటలను మార్చేస్తున్నారని బొత్స కామెంట్లు చేశారు. ఏపీ వృద్ధి రేటులో రెండో స్థానంలో ఉందంటూ చంద్రబాబు తన ప్రతిభను గొప్ప చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఈ రెండింటిలో నిజం అర్థం కాక ప్రజలు అయోమయంలో ఉన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర సంస్థకు ఇచ్చే లెక్కల్లో ఇది ఉంటుందని ఈ సంస్థకు ఏపీ సాధించగలననే అంచనాలతో ఈ వివరాలను ఇచ్చిందని తేటతెల్లమైందని బొత్స సత్యనారాయణ కామెంట్లు చేశారు. ఈ లెక్కలను పూర్తిస్థాయిలో ఖరారు చేయడానికి ఒక అడిట్ ప్రక్రియ కూడా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చేవే అసలైన లెక్కలని ఈ ప్రక్రియ జరగకుండానే చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. అనేక రాష్ట్రాల నుంచి అంచనాలు రాకుండానే పచ్చ మీడియా పబ్లిసిటీ చేస్తోందని బొత్స సత్యనారాయణ వెల్లడించడం గమనార్హం. ఈ కామెంట్ల గురించి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. కూటమికి వైసీపీ ఊహించని విధంగా షాకులిస్తోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే మాత్రం కూటమి సర్కార్ తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కూటమికి రాబోయే రోజుల్లో మరిన్ని షాకులు తగలడం పక్కా అని చెప్పవచ్చు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: