టీడీపీ నేతల వ్యతిరేకత జగన్‌పైనే కదా అనుకుంటే, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. జనసేన, టీడీపీ కలిసి ఉంటేనే ఓట్లు పడతాయని ఆంధ్రజ్యోతి చెప్పింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టీడీపీకి మద్దతు ఇస్తే జనసేనని తప్పు పడుతోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారంటూ కథనం వండి వార్చింది. నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇటీవల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాల్లో తమ మాట చెల్లలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా జనసేనకు ఛైర్మన్ పదవులు ఇచ్చేశారని ఆరుగురు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటే, ప్రస్తుతానికి 85 కమిటీలకు ఛైర్మన్లను నియమించారు. ఇందులో టీడీపీకి 68, జనసేనకు 14, బీజేపీకి 3 దక్కాయి. పొత్తులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో జనసేన, బీజేపీకి ఛాన్స్ ఇవ్వడం టీడీపీలో చిచ్చు పెడుతోంది.

ఈ విషయం చంద్రబాబు దాకా వెళ్ళింది. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు. పొత్తులో కాస్త సర్దుకుపోవాలని, రెండేళ్లు ఓపిక పడితే మన వాళ్లకి తక్కువ అవుతుందని అసంతృప్తి ఎమ్మెల్యేలకు నచ్చజెప్పాలని పల్లాకు చంద్రబాబు ఆర్డర్ వేశారు. రెండో విడతలో ఆరు ఏఎంసీలు జనసేనకు ఇచ్చారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

తమ సిఫార్సు చేసిన పేర్లను పక్కన పెట్టి జనసేన వాళ్లకి ఏఎంసీలు ఇవ్వడంపై ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. కనీసం తమ నియోజకవర్గాల్లో ఏఎంసీలను భర్తీ చేసేటప్పుడు తమకు చెప్పాలన్న కనీస మర్యాద కూడా లేదా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కనీసం తాము చెప్పిన పేర్లను పక్కన పెట్టామని కూడా చెప్పకపోవడం దారుణమని అంటున్నారు. పార్టీ తీరుతో నియోజకవర్గాల్లో పరువు పోతోందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేలతో మాట్లాడి కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనలో జూనియర్లకు పదవులు కట్టబెట్టడం టీడీపీ సీనియర్లకు మరింత కోపం తెప్పిస్తోంది. చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్న సీనియర్లను కాదని, కొత్తగా వచ్చిన జనసేన వాళ్లకి పదవులు ఇవ్వడం ఏమిటని వారు వాపోతున్నారు. తమకంటే లేటుగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లకు పదవులు దక్కుతుంటే టీడీపీ సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు.

అసలే జనసేనతో పొత్తు లేకపోతే ప్రభుత్వం వచ్చేది కాదని, ఇప్పుడు అనవసరంగా జనసేనకు పదవులు ఇస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. జనసేన త్యాగం చేసిందని, కనీసం 60 సీట్లు ఆశించినా 21 సీట్లతో సరిపెట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ 33 శాతం పదవులు అడిగారని, కానీ ఇప్పుడు 10 నుంచి 12 శాతం మాత్రమే ఇస్తున్నారని, ఇది జనసేనకు నష్టమే కదా అని అంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ వాళ్లకి పదవులు ఇస్తున్నారని, అక్కడ జనసేన వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి ఇది ఒక వర్గం వారి వాదన మాత్రమే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: