
అమరావతి అభివృద్ధి కోసం ఏకంగా 4200 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతోంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని శంకుస్థాపన చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కకు పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫుల్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో... అమరావతి రాజధాని నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. అటు కేంద్రం కూడా మంచి సపోర్ట్ ఇస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు... కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులను తెచ్చుకుంటున్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 4200 కోట్లు అమరావతి రాజధాని అభివృద్ధి కోసం విడుదల చేసింది కేంద్ర సర్కార్.
అలాగే పోలవరం అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు సైతం.. చేయూత ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. వేల కోట్ల నిధులను ఇప్పటికే ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మరింత సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఇక ఇదే అంశంపై కూటమి పార్టీల పార్లమెంట్ సభ్యులు తాజాగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగానే కేంద్రం నుంచి నిధులు సులభంగా వస్తున్నాయని పేర్కొన్నారు.