పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చారు. ఆయన పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అన్నిటికీ ఓర్చుకొని చివరికి జనసేన పార్టీని ఓ స్థాయిలో నిలబెట్టారని చెప్పవచ్చు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం కాకుండా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా లభించింది. అలా పవన్ కళ్యాణ్ పదవి వచ్చిన తర్వాత ఏదో సైలెంట్ గా ఉండకుండా  ప్రజల మన్ననలు పొందేందుకు  అనేక కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన   అడవి బాట పట్టి గిరిజనులకు బాసటగా నిలుస్తున్నారు. రియల్ లీడర్ గా పవన్ పేరు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. అల్లూరు జిల్లా పెదపాడు గ్రామంలో  అడవి బాట కార్యక్రమాన్ని తాజాగా ఆయన ప్రారంభించారు. జన్మన్ పథకం కింద అల్లూరు ఏజెన్సీకి 165 రోడ్లు మంజూరు చేశాడు.

 పెదపాడు గ్రామంలోని గ్రామస్తులతో రెండు గంటల పాటు సమీక్ష చేసి అంగన్వాడీ కేంద్రం సందర్శించారు. గత ప్రభుత్వం నిధులను అడ్డగోలుగా వాడేసిందని కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగలేదని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కావాలని సీఎం చంద్రబాబును   అడగ్గానే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేశారని తెలియజేశారు. గిరిజన ప్రాంతాలకు ఫండింగ్ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు, కాలువలు, మంచినీటి సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వందల వేల కోట్ల రూపాయలు మంజూరు అవుతూ ఉంటాయి. కానీ అభివృద్ధి విషయానికి వస్తే అవేవీ ఆ ప్రాంతాల్లో కనిపించవు. మరి డబ్బులన్ని ఎటు పోతాయి అంటే  అక్కడే ఉన్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది రాజకీయ నాయకులు మూడంతులు తినేసి ఒక వంతు ఖర్చు పెడుతూ ఉంటారు.

కాగితాల్లో పనులన్నీ పూర్తి చేసినట్టే చూపిస్తూ దశాబ్దాల కాలాల నుంచి గిరిజన ప్రాంతాలను వెనుకబాటు గురిచేస్తూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాకుండా  గిరిజన ప్రాంతాల్లో కూడా మంచినీరు, రోడ్లు, ఆంబులెన్స్, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో  ముందుకు వెళ్తున్నారు. ఏదో అధికారులను ఆదేశించి పనులు చేయాలని చెప్పకుండా తానే స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుని పనులు పూర్తయ్యే వరకు సమీక్ష నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ నిజమైన లీడర్ గా  పనిచేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: