
అయితే స్థానికంగా టిడిపి క్యాడర్లో ఆదిమూలం పై పెద్దగా సానుకూలత కనిపించడం లేదు .. వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలానికి టిడిపి క్యాడర్ పై పట్టు లేదు .. పైగా ఆయనను వ్యతిరేకిస్తున్న టిడిపి నాయకులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే ఆదిమూలం అంట కాగుతున్నారన్న చర్చ సైకిల్ పార్టీలో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా హేమలతకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులు ఇతర పార్టీ సీనియర్లు కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల నుంచి కూడా ఆదిమూలంపై హేమలత వర్గం ఆగ్రహంతో ఉంది. ఆయన పార్టీలోకి రాకుండా ఉండి ఉంటే టిక్కెట్ తనకే దక్కి ఉండేదని హేమలత వాదన .. కానీ ఆయన ఆ అవకాశాన్ని కొట్టేసారని ఎమ్మెల్యే హేమలత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు అందువచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.