
అయితే ఇందుకు సంబంధించి సీక్రెట్ గా దర్యాప్తు చేయాలని కియా కంపెనీ యాజమాన్యం కూడా ఫిర్యాదు చేయకుండా పోలీసులకు కోరిందట. అయితే ఈ ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు సైతం తెలియజేయడంతో ఫిర్యాదు చేసినట్లు అసలు విషయం బయటపడింది. కియా కార్ల పరిశ్రమకు ఇంజన్లు తమిళనాడు నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి.అయితే అక్కడ కంటైనర్లలో వాటిని తీసుకువస్తూ ఉంటారు.. ఇలా ఈ మధ్యకాలంలో లెక్కలన్నీ చూసుకుంటే సుమారుగా 900 ఇంజన్లు సైతం కనిపించకుండా పోయాయట.ఎన్నిసార్లు లెక్కవేసి చూసిన కూడా ఎక్కడ తేడా ఉండడంతో మిస్ అవుతుందని విషయం కియా సంస్థ నిర్ధారించుకుంది.
అందుకు సంబంధించి ఉద్యోగులను కూడా ప్రశ్నించారట. అయితే కొంతమంది ఉద్యోగులు వీటికి సంబంధించి ప్రశ్నించడంతో మానేసి వెళ్లిపోయారని వారి ఈ పని చేసి ఉంటారని అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.. అయితే ఇంజన్లను తీసుకువెళ్లాలి అంటే ఫ్యాక్టరీ లో నుంచి వచ్చిన తర్వాత కియా నుంచి తీసుకువెళ్లడం అది సాధ్యమయ్యే పని కాదు అని.. కానీ ఫ్యాక్టరీ కి రాకముందే వీటిని మాయం చేసి ఉంటారనే విధంగా కియా సంస్థ భావిస్తున్నది.పైగా ఇది ఒకరి ఇద్దరితో అయితే చేసే పని కాదు అని ఏదో ఒక గుంపు సిండికేట్ గా ఉండి చేసి ఉంటారని అనుమానాలు కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ దొంగలు కియా ఇంటి దొంగలే అయి ఉంటారని తెలిపారట మరి ఈ కేసు ఎప్పటిలోపు సాల్వ్ చేస్తారో చూడాలి.