
ఈ వేడుకలలో పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతమ్మ వారికి స్వయంగా ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళి ఇచ్చారు. అయితే ఆ తాళిని కళ్ళకు అద్దుకోవాల్సింది పోయి పొరపాటున ఎమ్మెల్యే విరుపాక్షి సీతమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు. అయితే ఈ తతంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే కూడా క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే విరూపాక్షి పండితులు కట్టమంటే తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్టు వివరించారు. దేవుళ్ళపై తనకు ఎంతో భక్తి కలిగి విశ్వాసంతో ఉంటానని కూడా వివరించారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే నిరూపాక్షి.