
ఇక ఈ దాడికి ఇండియన్ ముజాహిదీన్ ప్రధాన కారణమని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది .. అలాగే 2008 ఢిల్లీ బాంబు దాడులు , 2010 పుణే బాంబు దాడుల వ్యూహమే హైదరాబాదులో కూడా అమలు చేశారు .. అలాగే ఇండియన్ ముజాహిదీన్ కీలక నాయకుడు యాసిన్ భత్కల్ ఈ దాడిలో కీలకపాత్ర పోషించారు .. ఇక 2013 లో బీహార్ , నేపాల్ సరిహద్దుల్లో ఇతను అరెస్టు చేశారు .. ఇక రియాజ్ భత్కల్ అనే మరో సూత్రధారి ఇప్పటికీ దొరకలేదు .. ఇక యాసిన్ భత్కల్ తో పాటు ఈ కుట్రలో పాల్గొన్న నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు ..
అలాగే ఉరిశిక్ష పడిన వారిలో యాసిన్ భత్కల్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు .. అలాగే ఇతర ఉగ్రవాద కేసుల్లో కూడా ఇతను దోషిగా నిర్ధారణ అయ్యాడు .. రియాజ్ భత్కల్‌ను పట్టుకునేందుకు కేంద్ర సంస్థలు ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి .. ఇక మిగిలిన నిందితులు హైదరాబాద్ జైల్లో ఉన్నారు .. వీరికి ఇంకా ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి కొన్ని న్యాయపరమైన మార్గాలు కూడా ఉన్నాయి వాటిని వినియోగించుకునే అవకాశం ఉంది .. అందుకే ఉరి ఎప్పుడు అమలు చేస్తారని దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు ..