ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన సిఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రానికి కావాల్సిన నిధులు విషయంలో కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. దీనితో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించింది. దానికి తోడు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తరచుగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. వెనుకబడిన ప్రాంతాల నిధులతో పాటుగా పోలవరం ప్రాజెక్ట్, అమరావతి పనులకు కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది.

ఇక ఏపీలో నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఉన్న ఏ ఒక అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. దీనితో త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. అమరావతి పనులకు ప్రధానమంత్రి మోడీని ఆహ్వానించడంతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షా అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి వారిని ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అమరావతి పనుల పునః ప్రారంభానికి ఏర్పాట్లను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకుని పత్రాలు కూడా అందించారు. అటు విద్యాసంస్థలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా భూ కేటాయింపులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి పనులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా కేటాయించారు. మొత్తం 40,000 కోట్లతో అమరావతిలో పనులు మొదలుపెట్టన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో పాటుగా ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రాష్ట్రానికి భారీగా అప్పులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: