
అయితే శంకరును ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తనని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డారని తెలిసి ఆశ్చర్యపోయానని ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ..మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ ని షేర్ చేశారు. ఈ విషయం అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
మొత్తానికి రాజకీయపరంగా అడు జనసేన, వైసీపీ మధ్య వైర్యం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాలలో మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించడంతో అటు జనసేన కార్యకర్తలు వైసిపి కార్యకర్తలు కూడా ఆనందపడుతున్నారు. మరి ఈ ట్విట్టర్ సైతం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇస్తారో చూడాలి మరి. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడుతో పాటుగా మరి కొంతమంది విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యార్థులను బయటకి తీసుకురావడం జరిగిందట. అయితే ఈ ఘటన పైన ఇప్పటికే అటు నారా లోకేష్, కేటీఆర్, చిరంజీవి తదితర సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా స్పందించారు.