ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలు అరకు సమీపంలో ఒక కురిడి గ్రామానికి కూడా వెళ్లడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలతో మాట్లాడుతూ అక్కడ అధికారులు ఏర్పాటు చేసినటువంటి రచ్చబండ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ తాను ఇచ్చిన మాట ప్రకారం అరకులో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారని.. తాను తీసుకున్న దత్తత గ్రామం కంటే ఎక్కువ పనులు ఇక్కడే చేస్తున్నానని తెలిపారు.


ఈ క్రమంలోనే అక్కడ ఉన్న పలువురు వాలంటరీలు తమను విధులలోకి తీసుకోకపోవడం పైన ప్రశ్నించారు.. ఈ ప్రశ్నల పైన పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో వాలంటరీలు ప్రభుత్వానికి సైతం సంబంధం లేకుండానే పనిచేశారని అందుకే ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఏ డాక్యుమెంటరీ జీవోను కూడా తీసుకురావడానికి ప్రభుత్వం దగ్గర లేదు అంటూ తెలిపారు. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉన్నట్లుగా అధికారికంగా చూపించిన దాఖలు ఏవి లేవని తెలిపారు.



గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాలంటీలను మభ్య పెట్టారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. మరి ఎన్నికలలో సైతం హామీలు ఇస్తున్నప్పుడు వాలిటరీలకు 5000 నుంచి పదివేల రూపాయల వరకు పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇవన్నీ తెలియదా అంటూ పలువురు సోషల్ మీడియా నేటిజన్స్ తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాదా కూటమి ప్రభుత్వం లేదా అన్నది చూడాలి మరి. ఒకవేళ కొనసాగించకపోతే మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు వాలంటరీలు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తానికి వాలంటరీ వ్యవస్థ అయితే ఉండదని తేల్చి చెప్పినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: