హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి అనేక రకాల చర్చలు, వివాదాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల అడవిని, అందులోని జంతువులు, మొక్కలను తొలగించడంపై తెలంగాణ ప్రభుత్వంలో అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. 400 ఎకరాల భూమిని కాపాడడం కోసం విద్యార్థి సంఘాలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరూ వారి మద్దతును తెలుపుతున్నారు. 

గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి గురించి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వారి మద్దతును తెలపగా పోలీసులు లాటీచార్జీ చేశారు. సినీ నటులు సైతం సోషల్ మీడియా వేదికగా వారి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఊర్వశి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి గారు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలలో ఉన్న అడవిని, చెట్లను, జంతువులను తొలగించే ప్రతిపాదనను పునః పరిశీలించాలని నేను వేడుకుంటున్నానని ఊర్వశి అన్నారు. ఇది అభయారణ్యమే కాదు.... మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అంటూ నటి ఊర్వశి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పందించిన విధానంపై పలువురు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తమకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు... రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి వార్నింగ్ ఇస్తూ వెంటనే... ఆ 400 ఎకరాలలో ఉన్న చెట్లను కొట్టి వేయడాన్ని వెంటనే ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న జెసిబిలు అన్ని వెనక్కి వెళ్లిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: