వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లో టిడిపి నేతల మధ్య పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. పులివెందులలో టిడిపి ఇన్చార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి అక్కడ అన్ని వ్యవహారాలను చూస్తూ ఉంటారు. అయితే ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా టిడిపి నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కడ జిల్లా ఇన్చార్జిగా మంత్రి సవిత ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గం లో సమావేశం నిర్వహించగా అక్కడ ఎమ్మెల్సీ పైన సొంత పార్టీ శ్రేణులు దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారట.


దీంతో ఆ సమావేశం ఒక్కసారిగా గందరగోళాన్ని సృష్టించింది. చివరికి రాంగోపాల్ రెడ్డి ని పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పులివెందుల నియోజకవర్గం లో విస్తృత సమావేశంలో భాగంగా ఈ వేదిక పైన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆయన వేదిక పైకి వెళ్ళకూడదని బీటెక్ రవి వర్గీయులు రచ్చ చేశారట. వైయస్ రాజారెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులు పార్థసారధి రెడ్డి ఆయన తమ్ముడు శేషారెడ్డి అనుచరుల సైతం అక్కడ గొడవకు దిగి ఎమ్మెల్సీ పైన దాడి చేయడానికి సిద్ధమయ్యారు.


వైసీపీ కార్యకర్తలకు సైతం రామ్ గోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని వాళ్లు ఆరోపణ చేశారు మైనింగ్ విషయంలో కూడా అధికారులకు తప్పులు ఫిర్యాదు చేశారంటూ రాంగోపాల్ రెడ్డి పైన దాడికి దిగారట త్రిబుల్ ఐటీలో ఉండేటువంటి ఉద్యోగాలు క్యాంటీన్లకు సంబంధించి అన్ని విషయాలను రాంగోపాల్ రెడ్డి వైసీపీ శ్రేణులకే ఇస్తున్నారు అనే విధంగా పెద్ద ఎత్తున టిడిపి నేతలు నినాదాలు చేస్తూ ఉన్నారు. మరొకవైపు రాం గోపాల్ రెడ్డి కూడా వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు అక్కడి నుంచి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ని పంపించారు. ఇక పార్టీలో క్రమశిక్షణ లేకపోతే ఎట్లా అంటూ మంత్రి సవిత హెచ్చరించడం జరిగింది. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: