ప్రజలు తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే .. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని ఎక్కువ నిధులు తీసుకువస్తానని ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో వందకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 3వేల మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో రూ.వెయ్యికోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కల్పిస్తున్నారు.


ఇళ్ల పట్టాల పంపిణీ తొలి అడుగు మాత్రమేనన్న మంత్రి నారా లోకేష్.. దేశంలోనే అన్ని రంగాల్లో మంగళగిరిని నెం.1 తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పార్క్ లు, చెరువులు అభివృద్ధి చేయడంతో పాటు కల్యాణ మండపాల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్, భూగర్భ కరెంట్, భూగర్భ గ్యాస్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కల అయిన వంద పడకల ఆసుపత్రికి ఈ నెల 13న శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తిచేయనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజల మనస్సు గెలుచుకున్నారు.


ఈ నేపథ్యంలో మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్క్  బుధవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 0.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ను రూ.1.06 కోట్లతో అభివృద్ధి చేశారు. దీంతో పాటు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్క్ లు, పలు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. మంగళగిరిలోని టిడ్కో పార్క్ ను రూ.9 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయి. నులకపేట, చినకాకానిలో లేక్ పార్క్ లను అభివృద్ధి చేయనున్నారు. మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు మంత్రి లోకేష్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను క్రమపద్ధతిలో నెరవేరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: