నిన్నటి రోజున రాయలసీమలోని సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లడం జరిగింది.ఇందులోభ భాగంగా పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.. ఎల్లకాలం టిడిపి పాలనే ఉండదని..చంద్రబాబుకు ఊడిగం చేసిన వారందరికీ కూడా శిక్ష పడుతుందంటూ  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అధికారుల పైన ప్రత్యేకించి చర్యలు తీసుకుంటామని.. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామంటూ అలాంటి వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తామంటూ మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. టిడిపి నాయకుల అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బీహార్ లా మార్చారు అంటూ విమర్శించారు.



అయితే ఈ వ్యాఖ్యలకు సైతం ఎస్ఐ సుధాకర్ మాజీ సీఎం జగన్కు ఒక స్ట్రాంగ్ కౌంటర్ వేయడం జరిగింది.. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నారు జగన్ అవి ఏమైనా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలా..? మేము కష్టపడి చదివి యూనిఫామ్ సంపాదించుకున్న ఎన్నో వేల మంది పోటీ పరీక్షలలో నెయ్యి పరుగు పందాలు ఈవెంట్లలో క్వాలిఫై అయ్యి యూనిఫామ్ వేసుకున్నామని మీరు వచ్చి ఊడదీస్తాము అంటే ఇది కూడా తీయడానికి అరటి తొక్క కాదు.. పోలీసులు ప్రభుత్వానికి గాని నాయకులు గాని తొత్తు కాదు అంటూ మేము నిజాయితీగానే పనిచేస్తున్న నిజాయితీగానే చేస్తాం జాగ్రత్తగా మాట్లాడండి అంటూ రామగిరి ఎస్సై మాజీ సీఎం జగన్కు కౌంటర్ వేశారు. ఇందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.



గత నెలలో జరిగిన రామగిరి ఎంపీపీ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు చట్టబద్ధంగానే నడుచుకున్నారని వెల్లడించారు. మరి వీటికి ఎవరు ఎలాంటి కౌంటర్లు వేస్తారో చూడాలి మరి. ఇక రాబోయే ఎన్నికలలో మాత్రం వైసిపి పార్టీని అధికారం అంటూ  ఇటివలె ఏలూరులో జరిగిన ఆత్మీయ సమావేశ సభలో కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు పాలనలో దొంగ సాక్ష్యాలను సృష్టిస్తున్నారు వారికి నచ్చిన నాయకులను పద్ధతి ప్రకారమే కేసులలో ఇరికిస్తున్నారు అంటూ జగన్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: