
ఇంతకాలం అమెరికా విద్యార్థులకు ఒక వరంగా ఉన్న ఓపీటీ (Optional Practical Training) ప్రోగ్రామ్‌కు చెక్ పెట్టేందుకు అమెరికా సర్కార్ సిద్ధమైంది. చదువు పూర్తయ్యాక అమెరికాలోనే రెండేళ్ల పాటు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే ఓపీటీ ఇక గతం కానుందా అనే భయం ఇప్పుడు విద్యార్థులను వెంటాడుతోంది.
ఎఫ్1 వీసాతో అమెరికా వెళ్లే విద్యార్థులు అక్కడ చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ జాబ్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. షాపులు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు ఇలా చాలా చోట్ల పనిచేసుకునే అవకాశం ఉంటుంది. అసలు చాలా మంది విద్యార్థులు ఎఫ్1 వీసా తీసుకోవడానికి ప్రధాన కారణం ఓపీటీనే. చదువు అయిపోయాక రెండేళ్లు అమెరికాలో జాబ్ చేసి డబ్బు సంపాదించొచ్చు, కెరీర్ పరంగా సెట్ అవ్వొచ్చు అని చాలా మంది భావిస్తారు.
ఇంకా చెప్పాలంటే, ఎఫ్1 వీసా ఉన్నవారు పెళ్లి చేసుకుంటే వారి భార్యలు, భర్తలు కూడా డిపెండెంట్ వీసాలపై అమెరికాలో ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లే విద్యార్థులకు ఇప్పుడు గట్టి షాక్ తగలనుంది.
ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బయటి దేశాల నుంచి వచ్చినవారిని నియంత్రించాలని గట్టిగా ఫిక్సయిన కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు ఓపీటీ ప్రోగ్రామ్‌ను టార్గెట్ చేశారు. దీంతో దాదాపు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు షాక్ తిన్నారు. ఓపీటీ లేకపోతే అమెరికాలో చదివి ఏం చేయాలి? తిరిగి ఇండియా వెళ్లిపోవాలా? అసలు అమెరికా వెళ్లడమే వేస్ట్ అవుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు విద్యార్థుల మదిలో మెదులుతున్నాయి. ఇది నిజంగా దారుణమైన పరిస్థితి అనే చెప్పాలి. ఇండియన్ స్టూడెంట్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.