ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా ఉచితంగా చాలా కాలం నుండి రేషన్ షాపులలో బియ్యం పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే రేషన్ షాపుల్లో రెండు ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం కూడా దొడ్డు బియ్యం కావడంతో చాలా మంది ప్రజలు రేషన్ షాప్ నుండి వస్తున్న బియ్యాన్ని అమ్ముకొని వాటి స్థానంలో డబ్బులు తీసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. దీనితో అనేక మంది ప్రభుత్వాలు ప్రజలకు ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు. వాటి కోసం అనేక డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ వాటిని తినే ప్రజల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది. వాటి కోసం ప్రభుత్వం పెట్టిన డబ్బుల్లో సగంలో సగం కూడా లేకుండా వాటిని ప్రజలు వేరే బ్రోకర్లకు అమ్ముకుంటున్నారు అనే అభిప్రాయాలను ఎంతో మంది వినిపించారు. ఇకపోతే తాజాగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపులలో దొడ్డు బియ్యానికి బదులు సన్నబియాన్ని పంపిణీ చేసే పథకాన్ని మొదలు పెట్టింది.

ఈ పథకానికి ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉండటంతో ఆ సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కాస్త తగిలింది. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ ఈ శాఖకు మంత్రిగా పని చేస్తున్నాడు. ఇక తాజాగా ఆయన దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేసే విషయంపై వ్యాఖ్యలు చేశాడు. తాజాగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ... మేము రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వలేము. ఇప్పటికే మేము ప్రజలకు బియ్యం అందించేందుకు అనేక మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు మేము మంచి బియ్యం ఇస్తున్నాము. మళ్లీ స్పెషల్ గా సన్న బియ్యం ఇవ్వలేము అని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: