
కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర బీజేపీ తెలుగుదేశం నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిమ్మల రామానాయుడు ఆదోనికి రాగా టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. నియోజకవర్గంలో పార్థసారథి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు.
టీడీపీ భిక్షతో నియోజకవర్గంలొ బీజేపీ గెలిచిందని దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఆదోనిలో పార్థసారథి అనుచరులు చేసిన రచ్చ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఆదోని నియోజకవర్గంలో నేతల మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకప్పుడు వైసీపీ హవా ఉండేది. అయితే పరిస్థితులు మాత్రం ఊహించని విధంగా మారిపోయాయి. జగన్ చేసిన తప్పులు కూటమికి అంచనాలకు మించి ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. వైసీపీ భవిష్యత్తులో అయినా ఇక్కడ పుంజుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ఆదోని నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనల విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కూటమి సర్కార్ మరింత పుంజుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.