ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా సరే అక్కడ జనం ఎగబడి వస్తున్నారు.. సాధారణంగా మాస్ క్యారెక్టర్లలో చాలా రేర్ గా మాత్రమే ఉంటారు.. సినిమా యాక్టర్లు  అంటే చూడడానికి జనం ఎగబడడం లేకపోతే చిన్న చిన్న స్టార్స్ కూడా ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వచ్చిన కూడా ఎగబడి వచ్చేస్తూ ఉన్నారు జనాలు.. కానీ ఇలా ఒక రాజకీయ నాయకుడికి జనం ఎగబడేటువంటి సొంత పార్టీకి సంబంధించిన వాళ్లే అయినా, అలాగే కార్యకర్తలే అలాగే అభిమానులే వస్తూ ఉంటారు.


అయితే అలా రావడం అక్కడికి రావడానికి తగిన వాహనాలు ఏర్పాటు చేయడం.. దీంతో పాటుగా దగ్గరుండి మరి తీసుకువెళ్లి, భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివేవీ కూడా సాధ్యం కావాని చెప్పవచ్చు.. లేకపోతే ఎలక్షన్స్ ముందు అలాంటివి ఏర్పాటు ఎక్కువగా చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ జగన్ సత్యసాయి జిల్లాలోకి వస్తున్నారని అది కూడా వైసిపి నేత లింగమయ్య అనేటువంటి కార్యకర్తను కొట్టినటువంటి సందర్భంలో అతను తీవ్రమైనటువంటి గాయాలు పడి ఆ తర్వాత ప్రాణాలుతో మరణించారు.


దీంతో తన  కార్యకర్త మరణ వార్త విని పరామర్శించడానికి వెళ్తే.. పరిటాల సునీత రైజ్ చేసింది కరెక్టే.. పరామర్శించడానికి వచ్చారా లేకపోతే ప్రచారానికి వచ్చారా అన్నట్టుగా ప్రశ్నించారు?.. కానీ జగన్ వచ్చింది మాత్రం పరామర్శకే.. అక్కడకి వచ్చింది కూడా అదే.. కానీ అసహనంతో రగులుతున్నటువంటి వైసీపీ పార్టీ క్యాడర్ ఇంతకుముందు ఎలక్షన్స్కు ముందు జగన్ వదిలేసినటువంటి క్యాడర్.. జగన్ వల్ల తమకేమీ ఒరిగింది వాలంటరీలను  పెట్టి మమ్మల్ని దెబ్బ తీశారు అనుకున్నటువంటి కార్యకర్తలు. లేదంటే మమ్మల్ని పట్టించుకోలేదు మాకు పదవులు ఇవ్వలేదు అనేటువంటి ఫీలైన నాయకులు ఇప్పుడు జగన్ అవసరమేంటో తెలిసింది జగన్ యొక్క ప్రయోజనం ఏంటో తెలిసింది..


ఆనాడు జగన్ అన్నిటిలో కూడా తన పేరు తెచ్చుకుంటున్నారు.. మనకేం రావట్లేదు అన్న కోణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు.. జగన్ దిగిపోయిన తర్వాత తమకు రానటువంటి పథకాలు ,రోజు ఎదురవుతున్నటువంటి బాధలను సైతం చెబుతూ ఉన్నారు.. జగన్ విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. అందుకు సాక్ష్యం ఈ జనమే ఎగబడి వస్తున్నారని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలాంటి హామీలను నెరవేర్చక పోవడం అలాగే కొంతమంది నేర్తాలని టార్గెట్ చేస్తూ అణిచివేసేలా చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: