వివాదాస్పద ఉక్రేనియన్ రాజకీయవేత్త వోలోడిమిర్ ఒలెక్సాండ్రోవిచ్ జెలెన్స్కీ గురించి ఇపుడు అందరికీ తెలుసు. ఇతగాడు 2019 నుండి ఉక్రెయిన్ యొక్క 6వ మరియు ప్రస్తుత అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఫిబ్రవరి 2022 నుండి కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి రష్యన్ దండయాత్ర సమరం విషయమై జెలెన్స్కీ హాట్ టాపిక్ అయ్యాడు. జెలెన్స్కీ మధ్య ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన క్రివీ రిహ్‌లో స్థానిక రష్యన్ మాట్లాడే వ్యక్తిగా పేరుగాంచాడు. ఈ క్రమంలోనే క్రివీ రిహ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. కానీ, న్యాయవాద వృత్తిని అతడు ఎప్పుడూ చేపట్టలేదు. ఎంటర్టైన్మెంట్ రంగంలో తన వృత్తిని కొనసాగించాడు. ఈ సందర్భంలోనే క్వార్టల్ 95 అనే నిర్మాణ సంస్థను సృష్టించాడు. ఇది సినిమాలు, కార్టూన్‌లు మరియు టీవీ షోలను నిర్మించింది.

టీవీ షో పేరుతోనే ఒక రాజకీయ పార్టీని మార్చి 2018లో క్వార్టల్ 95 ఉద్యోగులు సృష్టించారు. 2019 అధ్యక్ష ఎన్నికల్లో జెలెన్స్కీ తన అభ్యర్థిత్వాన్ని డిసెంబర్ 31, 2018 సాయంత్రం 1+1 టీవీ ఛానెల్‌లో అప్పటి అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో చేసిన నూతన సంవత్సర వేడుకల ప్రసంగంతో పాటు ప్రకటించి అందరినీ అవాక్కయేలా చేశాడు. రాజకీయంగా బయటి వ్యక్తి అయిన జెలెన్స్కీ తనను తాను వ్యవస్థాపక వ్యతిరేకిగా మరియు అవినీతి వ్యతిరేక వ్యక్తిగా ప్రకటించుకున్నాడు. ఆ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల చరిత్రలో అతిపెద్ద మెజారిటీలో పోరోషెంకోను ఓడించి, 2వ రౌండ్‌లో 73.23 శాతం ఓట్లతో ఎన్నికల్లో గెలిచారు.

అయితే జెలెన్స్కీ రాజకీయ జీవితం అంత సాఫీగా సాగలేదు. తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో, జెలెన్స్కీ రష్యాతో ఉక్రెయిన్ యొక్క దీర్ఘకాలిక వివాదాన్ని అంతం చేస్తానని హామీ ఇవ్వడంతో రష్యా గుండెల్లో గుబులు పుట్టింది. కట్ చేస్తే... ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు దారితీసింది. ఇది ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం. అసలు విషయంలోకి వెళితే... రష్యా తరుపున యుద్ధం చేస్తున్న ఇద్దరు చైనా సైనికుల్ని ఉక్రెయిన్‌ అధికారులు పట్టుకున్నట్టు జెలెన్స్కీ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెడుతూ... "ఎందరో చైనీయులు మాకు తెలియకుండా రష్యా తరుపున యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ విషయంపై చైనా వివరణ ఇవ్వాలి. ఇంకా దీనిపై అమెరికా సహా ప్రపంచ దేశాలు కూడా స్పందించాలి!" అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: