కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేత్రలలో అసంతృప్తులు కనిపిస్తున్నాయట. పార్టీని అధికారంలోకి తేవడం కోసం చాలామంది టిడిపి నేతలు ఎంతో అవస్థలు పడిన కానీ.. కూటమి  వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం లేదంటు చాలామంది టిడిపి నేతలు కార్యకర్తలు అసంతృప్తిని తెలుపుతున్నారు. అధికారంలోకి రావడానికి అలా కష్టపడిన వారందరికీ కూడా ఫలితం దక్కలేదని ఆవేదన రోజురోజుకీ టిడిపి నేతలలో పెరుగుతూ ఉన్నదట. అలా ఇప్పటికే మూడుసార్లు నామినేట్ పదవులు భర్తీ చేయగా పనిచేసిన వారికి కాకుండా మరెవరకో పదవులు ఇస్తున్నారని ఆవేదన టిడిపిలో ఇప్పుడు మొదలైందట.


టిడిపి నాయకులు, కార్యకర్తలు పదవులు రాలేదని అసంతృప్తి విషయాన్ని టిడిపి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అంగీకరించడం జరిగింది. నామినేటెడ్ పదవుల విషయంలో అన్యాయం జరిగిందంటూ అటు నాయకులు కార్యకర్తలలో ఈ ఆవేదన ఉందని తెలిపారు. ఈ విషయాన్ని అధిష్టానం వరకు తీసుకువెళ్లామని తెలుపగా ఒకవైపు పార్టీ కోసం పని చేసే వాళ్లకే ఇలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా సిఫార్సు చేశామని వార్తలు వచ్చాయి..


కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది.అసలు ప్రభుత్వంలో ఎవరి పనులవుతున్నాయో ఏం జరుగుతుందో తెలియదని అసంతృప్తి టిడిపి క్యాడర్లో చాలా బలంగా నాటక పోయింది..టిడిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన శ్రీనివాసరావు గత రెండు రోజులుగా రాయలసీమ జిల్లాలోని పర్యటిస్తూ ఉన్నారట.దీంతో టిడిపి క్యాడర్ మొత్తం కూడా ఆయన దృష్టికి పలు రకాల వాస్తవాలను తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. పొత్తుల వల్ల బలమే లేనటువంటి జనసేన ,బిజెపికి చెందిన వారందరికీ కూడా పదవులు వచ్చాయని తమకు విలువ లేకుండా పోతుందని ఆవేదన చాలామంది నేతలు టిడిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గర చెప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసిపి పార్టీ ఓడిపోవడానికి కారణం తీవ్రస్థాయిలో క్యాడర్ అసంతృప్తి ఇప్పుడు అదే అసంతృప్తి టిడిపిలో కూడా మరింత ఎక్కువగా ఉందని వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: