భారత పార్లమెంటు వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ను ఆమోదించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చట్టం 1995 నాటి వక్ఫ్ చట్టానికి సవరణలు చేసే పనిలో ఉంది. లోక్‌సభ ఏప్రిల్ 3, 2025న మరియు రాజ్యసభ ఏప్రిల్ 4, 2025న ఈ బిల్లును ఆమోదించడం విశేషం. వక్ఫ్ చట్టం, 1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 2025గా మార్చారు. 'వాడుక ద్వారా వక్ఫ్' అనే నిబంధనను తొలగించడం జరిగింది. ఇకపై వక్ఫ్‌ను కేవలం ప్రకటన లేదా ఎండోమెంట్ ద్వారా మాత్రమే ఏర్పాటు చేయాలి. భూమిని దానం చేసే వ్యక్తి కనీసం 5 సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తూ ఉండాలి మరియు ఆ ఆస్తికి చట్టబద్ధమైన యజమాని అయి ఉండాలి. వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేర్చాలి. వక్ఫ్ ఆస్తుల నమోదు కోసం ఒక కేంద్రీకృత పోర్టల్ మరియు డేటాబేస్ ఏర్పాటు చేస్తారు.

ఇకపోతే, వక్ఫ్ బోర్డు విషయంలో కాంగ్రెస్ పలు రకాలుగా మోడీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... సాధారణ ముస్లింలు దేశ విభజన కావాలని ఎప్పుడూ కోరలేదు. కానీ కాంగ్రెస్ అధికార వాంఛ వలెనే భారత్ రెండుగా చీలిపోయింది. ఇపుడు వక్ఫ్ బిల్లు విషయంలో కూడా రాజకీయం చేయాలని చూస్తోంది. సమాజం, ముస్లింల మంచి కోసమే బిజెపి ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు చేసిందని.. దేశ ప్రజలు దీనిని గుర్తించాలని అన్నారు.

1947లో భారతదేశ విభజన బ్రిటిష్ ఇండియాను 2 స్వతంత్ర ఆధిపత్య రాష్ట్రాలుగా విభజించింది. ఈ క్రమంలో భారతదేశం మరియు పాకిస్తాన్ అనే 2 స్వపరిపాలన దేశాలు 1947 ఆగస్టు 14–15 అర్ధరాత్రి చట్ట బద్ధంగా ఉనికిలోకి వచ్చాయి. ఈ విభజన 12 నుండి 20 మిలియన్ల మందిని మతపరంగా నిరాశ్రయులను చేసినట్టు అయింది. కొత్తగా ఏర్పడిన ఆధిపత్యాలతో అధిక శరణార్థుల సంక్షోభాలను సృష్టించింది. అదే సమయంలో పెద్ద ఎత్తున హింస జరిగింది. దీనికంతటికీ కారణం ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పరిమితుల చట్టం, 1963 వర్తిస్తుంది. ఈ చట్టం ద్వారా 1923 నాటి ముస్సల్మాన్ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేశారు.అయితే, దీని అమలు మరియు ప్రభావం భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: