
ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా మే 27, 28 ,29 రోజు రోజులలో మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కానీ కడపలో వర్గ పోరు రావడంతో టీడీపీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతున్నదట. టిడిపి అధ్యక్షుడిగా కడప జిల్లాకు ఉన్న రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి అన్నిటిని చూసుకుంటున్నారు. అయితే ఈయన నాయకత్వం పైన అక్కడ జిల్లా నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారట.పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు కూడా ఆయన చర్చించలేదని. టిడిపి అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. దీనివల్ల అక్కడ టిడిపిలో తలనొప్పిగా మారుతున్నట్లు సమాచారం.
కడప జిల్లాలో కూడా శాశ్వత పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించుకుంది. అయితే ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది అనే విషయంపై నేతలను కూడా కోరిందట హై కమాండ్. కానీ జిల్లా అధ్యక్షుడు మాత్రం స్థానిక నేతలను ఎవరిని కూడా ఈ విషయంలో సంప్రదించకుండానే టిడిపి ఆఫీసు పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమా లను కడప జిల్లా నేతలందరూ కూడా కలిసికట్టుగానే సక్సెస్ చేస్తున్నప్పటికీ క్రెడిట్ అంతా కూడా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి వెళుతోందట. అలా మహానాడు ఏర్పాటు విషయంలో కూడా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అక్కడ నేతలు ఆరోపిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం టిడిపి జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉన్న శ్రీనివాసులు వైసీపీ నేతలను ఎంకరేజ్ చేస్తున్నారంటూ చాలామంది కంప్లైంట్ ఇచ్చారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.