
కానీ కాలాం మారింది జనం ఎక్కువైతే మజ్జిగ పల్చన అయినట్టు, అమెరికాకు మనోళ్లు క్యూ కట్టడంతో సీన్ రివర్స్ అయింది. అక్కడ ఏం జరుగుతుందో కళ్లారా చూస్తున్నాం కాబట్టి ఊరికే అమెరికా అంటే ఉలిక్కిపడిపోయే రోజులు పోయాయి. ఇప్పుడసలు కథ వేరే ఉంది.
అమెరికా ఇప్పుడు కళ్లు తెరిచింది. ఇన్నాళ్లూ ఊరుకుంది కానీ ఇప్పుడు అసలు రూపం చూపిస్తోంది. మనదేశంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్టు, సిగ్నల్ జంప్ చేసినట్టు, ఎక్కడ పడితే అక్కడ బండ్లు పార్కింగ్ చేసినట్టు అక్కడ చేస్తే.. అంతే సంగతులు. వెంటనే పట్టుకొని వెనక్కి పంపిస్తున్నారు. ఇక్కడ ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చు, దేశద్రోహులను కూడా వెనకేసుకొస్తారు. కానీ అమెరికా అలా కాదు. అక్కడ దేశభక్తి అంటే దేశభక్తియే. దేశాన్ని వ్యతిరేకిస్తే.. ట్రంప్ లాంటి వాళ్లు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దేశం విడిచి వెళ్ళమంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.
సోషల్ మీడియా పిచ్చిలో పడి, తెలిసి తెలియక ఏదేదో పోస్టులు పెడుతున్నారు మనోళ్లు. పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూనో, ఇజ్రాయెల్ ని తిడుతూనో ఏదో ఒకటి రాసేసి ఉంటారు. అంతే, అకౌంట్లోకి మెరుపులా ఒక మెయిల్ వస్తుంది. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. నువ్వు రూల్స్ బ్రేక్ చేశావని, సిస్టమ్ ని ధిక్కరించావని చెబుతారు. ఏం తప్పు చేశామని అమాయకంగా మొహం పెడితే.. నీ సోషల్ మీడియా పోస్టులే నీ కొంప ముంచాయని తేలుస్తారు.
ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాలి.. లీగల్ ఫైట్లు చేయాలి. ఇంకోపక్క ఉద్యోగాలు ఊడిపోతాయి. భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. అమెరికా వెళ్లడం ఒకప్పుడు కల.. కానీ ఇప్పుడు అమెరికా వెళ్లడమే నరకంలా మారుతోంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. అమెరికా మోజులో కళ్లు మూసుకొని వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి అడుగు వెయ్యి కళ్లతో ఆలోచించి వేయాల్సిన టైం ఇది.