
పార్టీ రథసారధిగా నారా లోకేష్ ను నియమించాలంటూ సీఎం చంద్రబాబుకి సజిషన్ ఇచ్చారట వర్మ. ఈ విషయం పైన ఆలోచించాలని కూడా తెలిపారట అలాగే యువ గళం పాదయాత్ర వల్లే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందంటూ తెలియజేశారు. ఇటీవలే కాకినాడ జిల్లాలో టిడిపి కార్యాలయంలో జరిగినటువంటి ప్రజాదర్బార్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ విషయాలను కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయం పైన కూడా అటు కార్యకర్తలు లోకేష్ కి మద్దతు పలికారు అంటూ తెలియజేశారు వర్మ.
గతంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలంటే చేసిన వర్మ అప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా ఆ సమయంలో నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అని చాలామంది నేతలు కూడా డిమాండ్ చేశారు. పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి రాజకీయం జరుగుతోంది. వర్మకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ముఖ్యంగా నాగబాబు మాట్లాడే మాటలు తీవ్రమైన చర్చకు తెరదించేలా కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే వర్మ, లోకేష్ నినాదాన్ని మరొకసారి తెరపైకి తేవడంతో ఇదే విషయం అందరి నేతలు డిమాండ్ చేస్తే సీఎం చంద్రబాబుకి తలనొప్పి తీసుకువచ్చేలా చేస్తోందట. లోకేష్ రథసారథిగా అయితేనే తమకు పార్టీలలో కూడా ప్రభుత్వంలో కూడా వెలుసుబాటు లభించేలా చేస్తారని చాలామంది నేతలు మాట్లాడుకుంటున్నారట.