
జగన్ : 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో జగన్ అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించి కేవలం సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, జలయజ్ఞం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలతో పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసినా మూడు రాజధానుల ప్రతిపాదన, అమరావతి పనుల నిలిపివేత, రోడ్ల విషయంలో నిర్లక్ష్యం ద్వారా తీవ్ర విమర్శల పాలై 2024 ఎన్నికల్లో అధికారానికి దూరమయ్యారు.
ఎవరి పాలన మెరుగైనది :
చంద్రబాబు, జగన్ పాలన విషయంలో ఎవరికి వారు తమకు నచ్చిన శైలిని అనుసరించారు. జగన్ అభివృద్ధికి కొంతమేర ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని రాష్ట్ర ప్రజలు భావిస్తుండగా చంద్రబాబు సంక్షేమ పథకాలను పెద్దగా షరతులు లేకుండా త్వరితగతిన అమలు చేయాలనే భావన వ్యక్తమవుతోంది. అభివృద్ధి విషయంలో చంద్రబాబు మార్క్ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చంద్రబాబు నాయుడు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందేలా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.