చంద్రబాబు : చంద్రబాబు నాయుడు గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 2000 రూపాయలు భృతి అందించడంతో పాటు కియా మోటార్స్, ఫోక్స్కాన్, టూరిజం అభివృద్ధి ద్వారా ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేశారు. విశాఖకు ఐటీ కంపెనీలు వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించారు.
 
అమరావతి నిర్మాణం ద్వారా నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంతో పాటు స్టార్టప్ లకు ప్రోత్సాహకాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ పాలసీలను తీసుకొచ్చారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో ఏపీ పోటీ పడటం కోసం చంద్రబాబు తన వంతు కృషి చేశారు.
 
జగన్ : జగన్ పాలనలో కొత్త పెట్టుబడులు రావడానికి బదులుగా లూలూ గ్రూప్స్ మరి కొందరు పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోయారు. జగన్ పాలనలో రాజధాని విషయంలో స్పష్టత కొరవడటంతో అంతర్జాతీయ కంపెనీలు ఏపీకి రావడానికి వెనుకంజ వేశాయి. 2.5 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలను వైసీపీ కల్పించినా పార్టీ కార్యకర్తలకే ఆ ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
 
గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా 1,26,000 ఉద్యోగాలను కల్పించినా వీరి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వైసీపీ ఫెయిలైంది. మెగా డీఎస్సీ భర్తీ ప్రక్రియను ఆలస్యం చేయడం కూడా వైసీపీకి ఒక విధంగా శాపంగా మారింది. ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారనే విమర్శలు సైతం జగన్ పాలనపై వ్యక్తం కావడం కొసమెరుపు.
 
ఇద్దరిలో ఎవరు బెస్ట్!?
 
చంద్రబాబు, జగన్ లలో ఎక్కువమంది బాబు పాలనే బెస్ట్ అని చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం చంద్రబాబుకు ప్లస్ అయిందని రాష్ట్రంపై ఆర్థిక భారం పెరగకుండా ఆయన నిర్ణయాలు ఉన్నాయని జగన్ తన చుట్టూ ఉన్న కోటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి తప్పటడుగులు వేశారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: