
జీరో పావర్టీ - పీ4 ముఖ్యోద్దేశం పేదరికం లేని పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్ మోడల్ ఏర్పాటు కాగా దాతృత్వం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలకు భిన్నంగా సంస్థాగత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాల అమలే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో దాతృత్వ గుణం ఉన్న ధనిక వర్గాలను "మార్గదర్శులు" అని సహాయం పొందే నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలు అని పిలుస్తారు. మార్గదర్శులు నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులకు విద్యా సహాయం, ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఉద్యోగాలకు సంబంధించిన మార్గదర్శకత్వం చేస్తూ ఇతర ప్రాథమిక అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ డ్యాష్ బోర్డ్ ల ద్వారా ఈ కార్యక్రమం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇందుకు సంబంధించి ఎలాంటి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.
సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు కచ్చితంగా మేలు జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో తన ప్రణాళికలు ఎప్పుడూ ఫెయిల్ కాలేదని చెబుతున్న చంద్రబాబు మాటల ద్వారా తన నిర్మాణాత్మక పరిపాలన ఎలా ఉంటుందో తెలియని వాళ్లకు సైతం అర్థమయ్యేలా చెబుతున్నారు