ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ముఖ్యమైన పథకాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఒకటి. ఎలాంటి షరతులు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఒకే విడతలో పెన్షన్ ను 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంచి పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, మానసిక సమస్యలు ఉన్నవాళ్లు, కిడ్నీ, తలసేమియా బాధితులకు మేలు కలిగేలా చేశారు.
 
అయితే ఈ పథకం అమలులో జరిగిన కొన్ని లోపాల వల్ల ప్రజలు ఈ స్కీమ్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా పెన్షన్ పెంచిన తర్వాత లబ్ధిదారుల సంఖ్యను వేర్వేరు కారణాలు చూపిస్తూ తగ్గించడం వల్ల గతంలో పెన్షన్ పొంది ఇప్పుడు పెన్షన్ రాని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం పెన్షన్ పంపిణీ చేస్తుండగా ఉదయాన్నే పింఛన్ పంపిణీ చేయడం ఈ ఉద్యోగులకు తలకు మించిన భారంగా మారింది.
 
అదే సమయంలో సచివాలయ ఉద్యోగులు ఒకే చోట ఉండి అక్కడికే లబ్ధిదారులను పిలిచి పెన్షన్ పంపిణీ చేస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు 50 ఏళ్ల వయస్సు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సైతం పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వగా ఆ హామీ అమలు దిశగా అడుగులు పడలేదు. భవిష్యత్తులో సైతం కూటమి సర్కార్ ఈ హామీని నిలబెట్టుకునే ఛాన్స్ లేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
 
60 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా దరఖాస్తు ఆమోదం పొంది పెన్షన్ అందాలంటే కొన్ని నెలల సమయం పడుతుందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాలలో వైసీపీ అనుకూల వ్యక్తులకు అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్ దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కు సంబంధించి చిన్నచిన్న మార్పులు చేస్తే ఈ పథకం వల్ల ప్రజలకు మేలు జరిగింది. పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నవాళ్లకు కచ్చితంగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయాలనే నిబంధనను తీసుకొని రావడంతో పాటు ఇతర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న ఏపీ వాళ్లకు అకౌంట్ లో నగదు జమయ్యే విధంగా నిబంధనలలో మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ కు ఒకటి, రెండు తేదీలలో మాత్రమే అమలు చేయడం వల్ల కూడా లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ జరిగేలా చూస్తే లబ్ధిదారులు సైతం సంతోషిస్తారు. ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ మార్పులు చేసుకుని కొంతమంది అనర్హులు సైతం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ బెనిఫిట్స్ పొందుతుండగా అలాంటి వ్యక్తుల పెన్షన్లను తొలగించి ఆర్థిక భారం కొంతమేర తగ్గే విధంగా ఏపీ సర్కార్ వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుపేదలలలో ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ లబ్ధిని త్వరితగతిన పొందేలా ఈ స్కీమ్ లో కూటమి సర్కార్ మార్పులు చేస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: