ఎన్టీఆర్ జిల్లాలో తాజాగా టిడిపిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. నేతలందరూ పైకి బాగానే ఉన్న లోలోపల మాత్రం నేతల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్న గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని స్థానాలలో కూటమి అభ్యర్థులే మంచి విజయాన్ని అందుకున్నారు.. అయితే గెలిచి కూడా పది నెలలు కాకముందే నాయకుల మధ్య ఆదిపత్య పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎంపీలు మధ్య సఖ్యత లేదని టిడిపి క్యాడర్ కూడా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట.


తిరువూరు ఎమ్మెల్యే కొలీకపూరి శ్రీనివాసరావు విషయంలో కూడా టిడిపి పార్టీ ఏ విధంగా కూడా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నప్పటికీ ఆయనను దూరం పెడుతున్నారనే చర్చ మాత్రం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. గత ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే కాదు ప్రజలు మనల్ని ఎంచుకునేది వాళ్ళ కంటే ఎక్కువ మంచి చేస్తామని అంటూ మాట్లాడారు. అలాగే కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం విధానము పైన కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో వైన్ షాపులు ఎక్కడెక్కడ ఉండేవి అని ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనే విషయాల పైన కూడా మాట్లాడారు.


ఈ విషయం పైన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యేని హెచ్చరించడం జరిగింది. అయినా కూడా కొలికపుడిలో ఎలాంటి మార్పు కనిపించలేదని దీంతో టిడిపి పార్టీ కార్యక్రమాలకు దూరం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎటువంటి కార్యక్రమానికి కూడా ఈ ఎమ్మెల్యేను కోకపోవడంతో ఇక కొలికపూడి కథ ముగిసినట్టే అనే చర్చలు వినిపిస్తున్నాయి. అలాగే మరొక టిడిపి ఎమ్మెల్యే వ్యవహారం కూడా ఇప్పుడు పార్టీలో వైరల్ గా మారుతున్నదట. దళిత మహిళ ఎమ్మెల్యేను ఎంపీ అవమానించారనే విధంగా మాట్లాడడం జరిగిందట .నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ నుండి నిలబడిన సౌమ్య గెలిచింది. అయితే చంద్రబాబు పర్యటనలో భాగంగా సౌమ్యను చంద్రబాబు దగ్గరికి అనుమతించలేదట. దీంతో పార్టీ నాయకత్వాన్ని కూడా చాలామంది నిలదీస్తూ ఉన్నారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ తో కూడా ఎంపీ కేశినేని చిన్ని విభేదాలు తలెత్తాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా బూడిద విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ..ఇలా టిడిపిలోని విభేదాలు మొదలయితే రాబోయే రోజుల్లో కష్టమని కార్యకర్తలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: