ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు " మార్గదర్శి బంగారు కుటుంబం, పీ4 - జీరో పావర్టీ " కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పేదరికం నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఉగాది రోజున ఏపీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలవుతోంది. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేయడంతో పాటు సమాజంలో మార్పు తీసుకొనిరావడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు.
 
దశల వారీగా 50 లక్షల మంది నిరుపేదలకు మేలు జరిగేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా ఏపీ సర్కార్ ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం 28 లక్షల కుటుంబాలను గుర్తించింది. అయితే ఏపీ ప్రజలందరికీ అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలగాలంటే డిజిటల్ గా కొన్ని విధానాలను ఫాలో అయితే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
 
పేదలకు మంచి చేసే " మార్గదర్శి బంగారు కుటుంబం, పీ4 - జీరో పావర్టీ " లాంటి పథకాలను స్వచ్చందంగా ముందుకు వచ్చే సినీ సెలబ్రిటీల చేత, క్రీడాకారుల చేత ప్రచారం చేయిస్తే సాధారణ ప్రజలకు సైతం ఈ కార్యక్రమం గురించి పూర్తిస్థాయిలో అవగాహన వస్తుంది.
 
ఏపీలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్మార్ట్ టీవీల ద్వారా " మార్గదర్శి బంగారు కుటుంబం, పీ4 - జీరో పావర్టీ " యాడ్స్ ను ప్రసారం చేయడం ద్వారా నిరక్షరాస్యులు సైతం ఈ కార్యక్రమం గురించి పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి.
 
ఏపీ సర్కార్ ఒక ప్రత్యేకమైన యాప్ ను రూపొందించి ప్రజల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డ్ నంబర్ ను ఎంటర్ చేసిన వెంటనే "పీ4 - జీరో పావర్టీ" తో పాటు ఇతర అర్హత ఉన్న పథకాల గురించి పూర్తి సమాచారం వచ్చేలా చేయాల్సి ఉంది. ఈ విధానం ద్వారా అర్హులకు సులువుగా పథకాలు అందుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp