యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ద్వారా కొన్ని రోజుల్లోనే ప్రజలకు " మార్గదర్శి బంగారు కుటుంబం, పీ4 - జీరో పావర్టీ " కార్యక్రమానికి సంబంధించిన అర్హతలు ఏంటి? ఈ కార్యక్రమానికి ఎంపికైతే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారనే విషయాలకు సంబంధించి అవగాహన కల్పించవచ్చు.
 
యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో ఇప్పటికే లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన వీడియోలను రీల్స్ రూపంలో షేర్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం ప్రజల జీవన విధానాలను ఏ విధంగా మెరుగుపరుస్తుందో పూర్తిస్థాయిలో తెలుస్తుంది.
 
ప్రభుత్వ సిబ్బంది, గ్రామస్థాయి నాయకులు ఉన్న వాట్సాప్, టెలీగ్రామ్ గ్రూప్ లలో ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని పోస్టర్ల రూపంలో పంపుతూ వాళ్ల ద్వారా ప్రజలకు ఈ స్కీమ్ గురించి తెలియజేయడం ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
 
ప్రభుత్వ యాప్స్, వెబ్ సైట్లలో నోటిఫికేషన్స్ ద్వారా ఈ స్కీమ్ గురించి ప్రజలకు సులువుగా తెలియజేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
 
తెలుగు టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో " మార్గదర్శి బంగారు కుటుంబం, పీ4 - జీరో పావర్టీ " ప్రోగ్రామ్ గురించి ప్రచారం చేయిస్తే యూట్యూబ్ వీక్షకులకు ఈ కార్యక్రమం గురించి తెలుస్తుంది.
 
ఎస్.ఎం.ఎస్, ఐ.వీ.ఆర్.ఎస్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ ల ద్వారా మోషన్ గ్రాఫిక్స్ రూపంలో స్థానిక భాషలో సైతం అర్థమయ్యేలా వీడియోలను క్రియేట్ చేసి పంపితే తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ప్రజలకు చేరువ అవుతుంది.
 
రూరల్ ఏరియాలలో ఎల్.ఈ.డీ స్క్రీన్లను ఏర్పాటు చేసి కార్యక్రమం గురించి అవగాహన కల్పించడంతో పాటు రాష్ట్రంలోని థియేటర్లలో ఈ కార్యక్రమానికి సంబంధించిన యాడ్స్ ప్రసారమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలకు ఈ కార్యక్రమం సులువుగా చేరువ అవుతుంది. చంద్రబాబు తన విజన్ తో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచే విధంగా అడుగులు వేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: