
తిరుపతి కాట్పాడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు సైతం కేంద్ర కేబినేట్ నుంచి ఆమోదం లభించడంతో చంద్రబాబుపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. త్వరితగతిన కీలక ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి మోదీ సర్కార్ అంగీకరించింది. విభజన చట్టంలోని పరిష్కారం కాని సమస్యల పరిష్కారం కొరకు ఏజీ కీలక సూచనలు చేశారు. మరో పెట్రోలియం రిఫైనరీకి సన్నాహాలు చేయడంతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు త్వరలో 350 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు.
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం 1332 కోట్ల రూపాయలను కేటాయించినట్టు సమాచారం అందుతోంది. 100కు పైగా కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీ గురించి చర్చించింది. ఏపీలో వ్యవసాయ యూనివర్సిటీ కొరకు మోదీ సర్కార్ 135 కోట్ల రూపాయల రేంజ్ లో విడుదల చేసింది.
ప్రతి రెండు నెలలకు ఒకసారి విభజనకు సంబంధించిన సమస్యల గురించి చర్చ జరగనుంది. విద్యాసంస్థల ఏర్పాటు, ఏపీలో గ్రేహౌండ్స్ సెంటర్ తో పాటు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఉంటాయి. వచ్చే రెండేళ్లలో విశాఖలో రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.