
జగన్ అనుభవ రాహిత్యం కార్యకర్తల, నేతల జీవితాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రాప్తాడులో వైసీపీ నేతలు హెలీప్యాడ్ దగ్గర బలప్రదర్శన చేయడం విమర్శలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. కార్యకర్తలు, నేతలు రెచ్చిపోవడం వల్ల కేసుల పాలు కావడం మినహా ఫలితం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని కచ్చితంగా చెప్పవచ్చు.
వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో జగన్ మినహా ఆ స్థాయి నేత మరొకరు లేరనే సంగతి తెలిసిందే. జగన్ తరపున వకాల్తా పుచ్చుకుని కొంతమంది నేతలు నోటిదూలతో చేస్తున్న కామెంట్లు సైతం పార్టీపై ప్రజల్లో చులకన భావం రావడానికి కారణమవుతున్నాయి. జగన్ తప్పు మీద తప్పు చేస్తూ పార్టీలో ఉన్న కొంతమంది మంచి నేతలను సైతం వదులుకుంటున్నారు.
జగన్ చేస్తున్న తప్పులే కూటమికి శ్రీరామరక్ష అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ మారాల్సిన అవసరం ఎంతో ఉందని మారని పక్షంలో మరిన్ని ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు సైతం దూరం పెట్టడం జగన్ కు ఎంతో చేటు చేస్తోంది. జగన్ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ముందడుగులు వేస్తే మాత్రమే పార్టీకి బెనిఫిట్ కలుగుతుంది. నోటి దురుసు ఉన్న నేతలను జగన్ కొంతకాలం పాటు పార్టీకి దూరం పెడితే పార్టీ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.